: పాక్ కు షాకిచ్చిన అనుపమ్ ఖేర్... వీసా ఆఫర్ ను తిరస్కరించిన వైనం


తనకు వీసా నిరాకరించిన పాకిస్థాన్ విదేశాంగ శాఖకు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ షాకిచ్చారు. మరోమారు పత్రాలు సమర్పిస్తే వీసా మంజూరు చేస్తామని భారత్ లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన విజ్ఞప్తిని అనుపమ్ ఖేర్ తిరస్కరించారు. ఈ మేరకు తనకు ఫోన్ చేసిన అబ్దుల్ బాసిత్ కు ఖేర్ తనకు వీసా అక్కర్లేదంటూ చెప్పేశారు. కరాచీలో పర్యటనకు వెళ్లేందుకు ఇటీవల ఖేర్ వీసా కోసం పాక్ హైకమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు వీసా ఇవ్వలేమని పాక్ తేల్చిచెప్పింది. దీనిపై సమాచారం అందుకున్న అబ్దుల్ బాసిత్ వెనువెంటనే రంగంలోకి దిగి, జరిగిన పొరపాటును గుర్తించి నేరుగా ఖేర్ కు ఫోన్ చేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా వీసా నిరాకరణకు గురైందని చెప్పిన బాసిత్, మరోమారు సంబంధిత పేపర్లు సమర్పిస్తే వీసా మంజూరు చేస్తామని కోరారు. అయితే బాసిత్ విన్నపాన్ని తిరస్కరించిన ఖేర్, సదరు తేదీల్లో వేరే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని, కరాచీకి వెళ్లే యోచనను విరమించుకున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News