: ఒకరిని అరెస్ట్ చేస్తే వందల మందిమి జైలుకొస్తాం...పర్యవసానాలకు చంద్రబాబుదే బాధ్యత!: ముద్రగడ హెచ్చరికలు


ఒక్క కాపు నేతను గానీ, కాపు సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తను గానీ అరెస్ట్ చేస్తే, వందల మంది జైలుకు రావడానికి సిద్ధమని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, 5వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్టు స్పష్టం చేశారు. ఈ లోగా తనను అరెస్ట్ చేస్తే, జైల్లోనే దీక్ష మొదలవుతుందని తెలిపారు. తునిలో ప్రభుత్వమే హింసాత్మక ఘటనలు చేయించిందని ఆరోపించిన ఆయన, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కాపులను కదిలిస్తే, జరిగే తీవ్ర పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. ఎవరిని అరెస్ట్ చేసినా, కనీసం బెయిల్ కు దరఖాస్తు చేసుకోబోమని తెలిపారు. కాపు ఉద్యమానికి, ఉద్యమకారులకు తాను అండగా నిలుస్తానని, ఎవరిపై చెయ్యి వేయాలన్నా, ముందు తనను దాటుకుని వెళ్లాలని హెచ్చరించారు. గతంలో కాపులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని, కాపులను బీసీల్లో చేర్చాలని, పెట్టిన అన్ని కేసులనూ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News