: లక్నోలో చిక్కిన లష్కరే ఉగ్రవాది అబ్దుల్ అజీజ్... ఇంటరాగేట్ చేస్తున్న తెలంగాణ పోలీసులు
లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ తెలంగాణ పోలీసులకు చిక్కాడు. యూపీ పోలీసుల సహకారంతో లక్నోలో దాడులు జరిపిన తెలంగాణ పోలీసులు అజీజ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన అజీజ్ పై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గణేష్ ఆలయం పేల్చివేత కేసులో అజీజ్ ప్రధాన నిందితుడు. 2001లో అరెస్టయి, ఆపై బెయిలు మీద బయటకు వచ్చిన అజీజ్ 2003లో సౌదీకి పారిపోయాడు. ఆపై కొన్నేళ్ల తరువాత వీసా ముగియడంతో, సౌదీ ప్రభుత్వం అజీజ్ ను ఇండియాకు తిప్పి పంపింది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న అజీజ్, ఇండియాలో పలు విధ్వంసాలకు వ్యూహ రచన చేశాడు. పోలీసులకు చిక్కిన అజీజ్ ను లక్నోలో ఇంటరాగేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.