: వెంకన్నను దర్శించుకున్న అమిత్ షా... పుణ్యక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడనని ప్రకటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీవేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వెంకన్న దర్శన నిమిత్తం నిన్న రాత్రికే తిరుమల చేరుకున్న అమిత్ షా... నేటి ఉదయం ప్రారంభ సమయంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు అమిత్ షాకు వసతి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. పలు ప్రశ్నలు సంధించారు. అయితే తిరుమల వచ్చే అందరు నాయకులకు భిన్నంగా అమిత్ షా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడబోనని అమిత్ షా మీడియా ప్రతినిధులకు తేల్చిచెప్పారు.