: ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్... మే 16న పరీక్ష, 27న రిజల్ట్స్
ఏపీలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘ఏపీ ఐసెట్-2016’ నోటిఫికేషన్ విడులైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జీఎస్ఎన్ రాజు కొద్దిసేపటి క్రితం ఈ ప్రకటనను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6 నుంచి మార్చి 5 వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి హాల్ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. మే 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేస్తారు.