: స్టెప్పులతో దుమ్మురేపిన ఫరూక్ అబ్దుల్లా!... సోషల్ మీడియాలో వీడియో వైరల్


జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నిన్న సరికొత్త అవతారం ఎత్తారు. అచ్చం సినిమా హీరోలా స్టెప్పులేసిన అబ్దుల్లా, బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ కు ఏమాత్రం తీసిపోనని నిరూపించారు. ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన ‘ఎన్టీడీవీ ఇండియన్ ఆప్ ద ఇయర్ 2015’ అవార్డుల వేదికపై ఆయన హుషారుగా స్టెప్పులేశారు. బాలీవుడ్ తాజా హిట్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’ లోని ‘మల్హరీ’ పాటకు ఆయన వేసిన స్టెప్పులతో ఆ వేదిక హోరెత్తిపోయింది. వేదికపై ‘బాజీరావ్ మస్తానీ’ హీరో రణవీర్ సింగ్ తో కలిసి హుషారుగా స్టెప్పులేసిన అబ్దులా, రణవీర్ కంటే వేగంగా కాలు కదిపి ఆ కార్యక్రమానికి హాజరైన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రస్తుతం అబ్దుల్లా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

  • Loading...

More Telugu News