: రెండు సెకన్లలో 70 వేల 'లీ1ఎస్' అమ్మకాలు!
భారత మార్కెట్లో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన మరో చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ ఆరంభంలోనే అదరగొట్టింది. మొత్తం 70 వేల 'లీ1ఎస్'లను ఫ్లిప్ కార్ట్ మాధ్యమంగా అమ్మకానికి ఉంచగా, కేవలం 2 సెకన్లలో అవన్నీ అమ్ముడుపోయాయని 'లీ ఎకో సిస్టమ్ టెక్నాలజీస్' భారత సీఓఓ అతుల్ జైన్ వెల్లడించారు. ఈ ఫోన్ కోసం మొత్తం 6.05 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ఫ్లిప్ కార్ట్ లో ఏ బ్రాండ్ కైనా ఇంతమంది ప్రీ రిజిస్టర్ చేసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. తొలి ఫ్లాష్ సేల్ విజయవంతమైన నేపథ్యంలో 9వ తేదీన మరోసారి సేల్ ఉంటుందని, ఈ దఫా సాధ్యమైనన్ని ఎక్కువ ఫోన్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. డిసెంబర్ లోగా ఇండియాలో టాప్-3 మొబైల్ కంపెనీల్లో ఒకటిగా నిలవడమే తమ లక్ష్యమని అతుల్ జైన్ తెలిపారు.