: డబ్బుల్లేవట... షారూక్ ఖాన్ తీర్చుకోలేకపోయిన కోరిక ఇది!
బాలీవుడ్ బాద్షా షారూక్... 'బార్న్ విత్ సిల్వర్ స్పూన్' కాకపోయినా, కష్టపడి ఎంతో సంపాదించాడు. భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకడన్న పేరు కూడా ఉంది. అయితేనేం, ఆయనకూ తీరని కోరికలు ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఓ విమానాన్ని కొనుక్కోవాలని ఆయన అనుకుంటున్నా, అంత డబ్బు ఉండటం లేదట. ఈ విషయాన్ని షారూక్ స్వయంగా వెల్లడించాడు. తాజా సామాజిక మాధ్యమ యాప్ 'ఫేమ్' ద్వారా తన అభిమానులతో మాట్లాడిన ఆయన, తన డబ్బంతా సినిమాల్లోనే పెడుతున్నానని, విమానం కొనుగోలు చేసేంత డబ్బొస్తే, దాన్ని కొంటానని చెప్పాడు. తన ముందు ఎప్పుడూ రెండు సవాళ్లుంటాయని, ఒకటి విమానం కొనుగోలు చేసేంత డబ్బు పోగేయడం కాగా, రెండవది సినిమాలు చేయడమని చెబుతూ, ఈ రెండింటిలో సినిమాకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు.