: పెళ్లి పీటలు ఎక్కుతున్న నటి సంఘవి... ఐటీ సంస్థ అధినేతతో మరికాసేపట్లో వివాహం
‘సింధూరం’ చిత్రంలో తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సినీ నటి సంఘవి నేడు పెళ్లి పీటలు ఎక్కనుంది. కర్ణాటకకు చెందిన సంఘవి తెలుగులోనే కాక మిగిలిన దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐదారేళ్ల క్రితమే టాలీవుడ్ కు దూరమైన సంఘవి, ఓ ఐటీ సంస్థకు అధిపతిగా ఉన్న కేరళ వ్యాపారవేత్త వెంకటేశన్ తో పెళ్లికి అంగీకరించింది. మరికాసేపట్లో వీరి పెళ్లి బెంగళూరులోని ‘వివాంతా తాజ్’ హోటల్ లో జరగనుంది. వివాహ కార్యం ముగిసిన వెంటనే అక్కడే రిసెప్షన్ కు సంఘవి ఏర్పాట్లు చేసిందట.