: మన కుటుంబ వ్యవస్థ గొప్పది...మీ పిల్లలు ఉగ్రవాదం వైపు మరలకుండా చూడండి: రాజ్ నాథ్ సింగ్


భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ముస్లిం మతపెద్దలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశం ఎంత సురక్షితమైన దేశమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్లిం యువకులు ఉగ్రవాద సంస్థల ప్రలోభాలకు తలొగ్గకుండా చూడాలని ఆయన కోరారు. ఉగ్రవాదం ముప్పు ముంచుకొస్తున్నందున యువత అలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా కుటుంబ సభ్యులే చూసుకోవాలని ఆయన సూచించారు. మనదేశ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని పేర్కొన్న ఆయన, భారతీయ నైతికత యువతను అటువైపు వెళ్లనీయదని విశ్వాసం వ్యక్తం చేశారు. యవతరం ఆలోచనల నియంత్రణలో కుటుంబ పెద్దలే బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జమాతే ఉలేమా ఈ హింద్ మౌలానా అర్షద్ మదానీ, అజ్మీర్ షరీఫ్ మౌలానా అబ్దుల్ వహీద్ హుస్సేన్ తదితర ముస్లిం సంస్థల పెద్దలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News