: దానిని అపురూపంగా దాచుకున్నాను: సత్య నాదెళ్ల
సాధారణంగా భారతీయులందరికీ ఇష్టమైన క్రీడ క్రికెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు కూడా క్రికెట్ అంటే ఇష్టమనే చెప్పాలి. ఎందుకంటే, సచిన్ టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన బ్యాటును ఆయన అపురూపంగా దాచుకున్నానని చెప్పారు. 'నాన్న ఫైనాన్షియర్, మార్క్సిస్టు, లెఫ్టిస్టు...అమ్మేమో సంస్కృతంలో ప్రొఫెసర్. దీంతో వారి అభిప్రాయాలు కలిసేవి కాదు. ఒక విధంగా అదే నాకు లాభించింది. దేని గురించైనా లోతుగా ఆలోచించి, ఒక అభిప్రాయం ఏర్పరచుకోగల సత్తాను సమకూర్చింది' అన్నారాయన.