: ఎంఐఎం కార్యకర్తల తీరు గూండాలను తలపించింది!: తెలంగాణ డిప్యూటీ సీఎం
ఎంఐఎం కార్యకర్తల తీరు గూండాలను తలపించిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల్ని సభ్యసమాజం ఖండిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరైన సంస్కృతి కాదని ఆయన పేర్కొన్నారు. భౌతిక దాడులకు పాల్పడడం సరైన విధానం కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, మహుమూద్ అలీ కుమారుడిపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా దాడి చేశారని తెలిసిన వెంటనే, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ తదితరులు ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు.