: కాపు సంఘాల నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో 13 జిల్లాల కాపుసంఘాల నాయకులతో సమావేశం ముగిసింది. కాపులకు న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఈ సందర్భంగా బాబు వారికి తెలిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కిమిడి కళావెంకట్రావు, నారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించారు. అందులో...కమిటీ నివేదికను తొమ్మిది నెలల నుంచి మూడు నెలలలోపు తెప్పించి చర్చించాలని వారు కోరారు. కాపుల సంక్షేమ సంఘానికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని కాపు సంఘాల నేతలు పేర్కొన్నారు. కాగా, తాము శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నామని, సాంకేతిక అంశాలను పరిష్కరించాలని భావిస్తున్నామని, లేని పక్షంలో జీవో జారీ చేయమంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వాటిని నిలిపివేసే అవకాశం ఉందని ఆయన తెలిపారని సమాచారం. దీంతో బాబు ప్రతిపాదనకు కాపు కుల సంఘాల నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News