: ఏంఐఎం మూలాలు కదిలిస్తాననే భయంతోనే దాడులు: షబ్బీర్ అలీ
హైదరాబాదులోని పాతబస్తీలో ఎంఐఎం పార్టీ మూలాలు కదిలిస్తాననే భయంతోనే తనపై దాడులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. పాతబస్తీలో పోలీసులు కూడా ఎంఐఎం గూండాల ధాటికి చేతులు ఎత్తేశారని ఆయన పేర్కొన్నారు. తాను వస్తే ఎక్కడ వారి పునాదులు కదిలిపోతాయోనని ఎంఐఎం నేతలు ఆందోళన చెందారని ఆయన అన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.