: ఉత్తమ్, షబ్బీర్ లపై దాడికి నిరసనగా గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ
పాతబస్తీలోని పురాన్ పూల్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలపై దాడికి నిరసనగా కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎంఐఎం నేతలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా డీజీపీ ఆఫీసు ముందు ధర్నా చేయనున్నారు. తరువాత దాడికి సంబంధించి కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేస్తారు.