: ఓడిపోతామన్న భయంతోనే ఎంఐఎం దాడులు చేస్తోంది: డిప్యూటీ సీఎం కుమారుడు
గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఎంఐఎం నేతలు దాడులకు పాల్పడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడు అజం అలీ అన్నారు. తనపై దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారు భయపెడితే తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఎంఐఎం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. పాతబస్తీలోని అజంపురలో ఉన్న డిప్యూటీ సీఎం నివాసంపై ఎమ్మెల్యే బలాలతో కలసి వచ్చిన ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడగా, అజం అలీ గాయపడ్డారు.