: పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించారు!: కిషన్ రెడ్డి
న్యూసిటీలో టీఆర్ఎస్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం కనుసన్నల్లో పోలీసులు పనిచేశారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేశారని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంఐఎంను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయడం వారికి కొత్త అనుభవమన్నారు. ఎంఐఎంతో చెలిమి పులిపై స్వారీతో సమానమని, టీఆర్ఎస్ కూడా ఎంఐఎంకు అనుకూలంగా ఉందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పలు డివిజన్లలో బీజేపీ కార్యకర్తలను మజ్లిస్ కార్యకర్తలు కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు.