: రిగ్గింగ్ లు చేసుకుంటున్నప్పుడు...ఎన్నికలు ఎందుకు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి


పాతబస్తీలో రిగ్గింగ్ చేసుకుంటున్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులోని మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ఓట్లేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లోనే ఓట్లు వేసుకోవడం కరెక్టని ఆయన చెప్పారు. డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు ఓ 'ఫార్సు' అని ఆయన చెప్పారు. తన కారు అద్దాలు పగులగొట్టడంపై ఆందోళన లేదని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ పై చేయిచేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురానాపూల్ లో ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని కోరుతామని అన్నారు.

  • Loading...

More Telugu News