: ‘బాజీరావు మస్తానీ’కి నోటీసులు!


‘బాజీరావు మస్తానీ’ చిత్రానికి మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చరిత్రను వక్రీకరించేలా, తమ రాజకుటుంబ గౌరవానికి భంగం కల్గించేలా ఈ చిత్రాన్ని రూపొందించారని బాజీరావు కుటుంబ వారసుడు తమ్కీన్ అలీ బహదూర్ కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకనిర్మాతలకు, సెన్సారు బోర్డుకు, సమాచార పౌర సంబంధాలశాఖకు, భారత ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందే స్క్రిప్టును, తొలి కాపీని తమకు చూపించాలని సెన్సారు బోర్డుకు, నిర్మాతలకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని, ఆ సినిమా విడుదలవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తమ్కీన్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News