: ప్రత్యేక ధర్మాసనానికి స్వలింగ సంపర్కుల పిటిషన్ బదిలీ


స్వలింగ సంపర్కుల అంశం సుప్రీంకోర్టులో తాజాగా విచారణకు వచ్చింది. ఐపీసీ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసని పిటిషన్ ను ఇవాళ న్యాయస్థానం పరిశీలించింది. స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా? లేక కొనసాగించాలా? అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. అవసరమైతే ఈ విషయంపై భవిష్యత్తులో విస్తృత విచారణ చేపడతామని పేర్కొంది. దాంతో ఆ పిటిషన్ బదిలీ అయింది.

  • Loading...

More Telugu News