: గ్రేటర్ లో 4 గంటల వరకు 43.25 శాతం పోలింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం సాయంత్రం 4 గంటల వరకు 43.25 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఆ ఏడాది గ్రేటర్ ఎన్నికల్లో 42.92 శాతం పోలింగ్ నమోదైంది. మరో 40 నిమిషాల్లో పోలింగ్ పూర్తవనుంది.