: భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు వాగ్దానం చేసింది: రాహుల్ గాంధీ
భారత ప్రభుత్వం విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ల హోదా ఇస్తామని ప్రమాణం చేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆయన మాట్లాడుతూ, అప్పటి ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హోదాలో తాము ఆ ప్రమాణం చేయలేదని, భారత్ ప్రభుత్వ హోదాలో దానిని ప్రమాణం చేశామని ఆయన తెలిపారు. ఆ బాధ్యతను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్రమోదీపై ఉందని రాహుల్ అన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ కు భారత ప్రభుత్వం చేసిన ప్రమాణాన్ని పూర్తి చేయలేకపోయిందని ఆయన చెప్పారు. వందేళ్ల భారత దేశ చరిత్రలో పార్లమెంటు ఓ రాష్ట్రానికి చేసిన ప్రమాణం నెరవేర్చలేకపోయిందని ఆయన తెలిపారు.