: ఇవి 'గూండాయిజం' ఎలక్షన్లు: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి
ఈసారి జరుగుతున్న ‘గ్రేటర్’ ఎన్నికల్లో గూండాయిజం చేస్తున్నారని.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతి బూత్ కి తిరిగి రిగ్గింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి ఆరోపించారు. రెండు వందల మోటార్ సైకిళ్ళతో తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి అసదుద్దీన్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడని అన్నారు. 'ఈ విషయమై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులను కొట్టారు, ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఫొటో గ్రాఫర్ కెమెరా లాక్కున్నారు.. ఇదంతా జరుగుతున్న పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ నగర పోలీస్ కమిషనర్ పట్టించుకోవటం లేదు' అని ఆయన ఆరోపించారు.