: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న షారూఖ్, కాజోల్ ల ముద్దు దృశ్యం!


బాలీవుడ్ ప్రముఖ నటులు షారూఖ్ ఖాన్, కాజోల్ జంట ముద్దు సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'దిల్ వాలే' సినిమా అంచనాల మేరకు వసూళ్లను రాబట్టలేదు. బాలీవుడ్ లో మంచి బిజినెస్ మ్యాన్ గా పేరున్న షారూఖ్ తొలిసారి వసూళ్ల వేటలో వెనుకబడ్డాడు. దీంతో ఆ సినిమాలోని 'టుకుర్ టుకుర్' అంటూ సాగే పాట మేకింగ్ వీడియోను ఆ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో షారూఖ్, కాజోల్ ఒక జంటగా, వరుణ్ ధావన్, కృతి సనన్ మరోజంటగా కనిపిస్తారు. ఈ సందర్భంగా కాజోల్, షారూఖ్ ఖాన్ ఒకరినొకరు ఊహించని విధంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ ముద్దు దృశ్యం వల్ల ఈ మేకింగ్ వీడియో విశేషమైన ప్రజాదరణ పొందుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News