: నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చాలని కేటీఆర్ ఆదేశం
నల్లగొండ జిల్లాలో వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి శాన్వి చనిపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులపై మండిపడ్డారు. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చి వేయాలని ఆదేశాలున్నప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చాలని ఆదేశించారు. ఆదేశాలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేగాక బోరుబావి యాజమానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.