: ఢిల్లీలో రాయల్ ఎన్ ఫీల్డ్ 'హిమాలయన్ బైక్' ఆవిష్కరణ
గత కొన్ని వారాలుగా టీజర్ వీడియోలతో వినియోగదారుల్లో ఆసక్తి కలిగించిన రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త మోడల్ 'హిమాలయన్ బైక్' ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 441 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైక్ ధర సుమారు రూ.1.8 లక్షలు. పర్వత ప్రాంతాలు, ఎత్తైన కొండలు, గుట్టలు వంటి తదితర ప్రాంతాల్లో తేలికగా నడిచేందుకు వీలుగా ఈ బైక్ ను డిజైన్ చేశారు. అయితే తమ సంస్థకు చెందిన ఇతర మెడల్స్ తో ఈ బైక్ కు ఎలాంటి సారూప్యం లేదని రాయల్ ఎన్ ఫీల్డ్ చెబుతోంది. త్వరలోనే వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుందని తెలిపింది.