: సల్మాన్ ఖాన్ కు హైదరాబాద్ లో ఓటు?


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హైదరాబాదులో ఓటుహక్కు కలిగిఉండడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాదులోని గౌలిపుర ఓటర్ల జాబితాలో సల్మాన్ ఖాన్ పేరు చోటుచేసుకుంది. దీంతో హైదరాబాదులో సల్మాన్ ఖాన్ ను ఓటు హక్కు ఉండడమేంటని పోలింగ్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ ఫోటో కూడా ఉండడం విశేషం కాగా, ఆ ఓటర్ లిస్టులో సల్మాన్ తండ్రి సలీం ఖాన్ అని, సల్మాన్ వయసు 64 ఏళ్లు అని ఉంది. దీంతో ఓటరు కార్డు, ఓటు హక్కు ఉన్నా, లిస్టులో పేర్లు లేక చాలా మంది ఓటింగ్ కు దూరమైన తరుణంలో సల్మాన్ పేరు ఓటర్ల జాబితాలో చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News