: గ్రేటర్ లో 2 గంటల వరకు 32 శాతం పోలింగ్... హైదర్ నగర్ డివిజన్ లో భారీ పోలింగ్


గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. తాజాగా మధ్యాహ్నం 2 గంటల వరకు 32 శాతం పోలింగ్ నమోదైంది. కాగా మరో రెండు గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇదిలాఉంటే కూకట్ పల్లి సర్కిల్ లోని హైదర్ నగర్ (డివిజన్-123) లో అత్యధికంగా 46 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూకట్ పల్లి-14ఎ సర్కిల్ లో 26.07 శాతం, కూకట్ పల్లి-14బి సర్కిల్ లో 29.09 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదే సర్కిల్ లోని ఫతేనగర్ డివిజన్ లో 38.37 శాతం, అల్లాపూర్ లో 27.94 శాతం, బాలాజీనగర్ లో 19 శాతం పోలింగ్ జరిగింది. అయితే మొత్తంగా చూస్తే పోలింగ్ శాతం అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News