: అనుపమ్ ఖేర్ అసలు వీసాకి దరఖాస్తు చేయనేలేదు: పాక్ అధికారులు


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పాకిస్థాన్ వీసా నిరాకరించినట్టు వచ్చిన వార్తలపై ఆ దేశ అధికారులు స్పందించారు. అసలాయన వీసాకి దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశారు. అటువంటప్పుడు తామెలా వీసా నిరాకరిస్తామని ప్రశ్నించారు. 'వీసాకి దరఖాస్తు చేసుకున్నట్టు ఏదైనా ఆధారం ఉందేమో మీరు సరిగా చూసుకోండి' అని పాక్ హై కమిషన్ ప్రధాన కార్యదర్శి అలీ మెమన్ అన్నారు. మరోవైపు తనకు వీసా నిరాకరించడంపై అనుపమ్ స్పందిస్తూ, చాలా బాధ కలిగించిందని, ఎంతో నిరుత్సాహపడ్డానని చెప్పారు. మరీ రెండు విషయాలలో ఏది నిజమో తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News