: లాభాల నుంచి దిగజారిన మార్కెట్!
సెషన్ ఆరంభం నుంచి అత్యధిక సమయం లాభాల్లో కొనసాగిన సూచికలు, యూరప్ మార్కెట్ల ప్రారంభం అనంతరం ఒత్తిడిలోకి కూరుకుపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 91 పాయింట్లు పడిపోయి 0.37 శాతం నష్టంతో 24,733 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 35 పాయింట్లు పడిపోయి 0.47 శాతం నష్టంతో 7,520 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.63 శాతం, స్మాల్ క్యాప్ 0.14 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభాల్లో నడిచాయి. భారతీ ఎయిర్ టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, పీఎన్బీ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సిప్లా, జడ్ఈఈఎల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 93,80,277 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మొత్తం 2,587 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,072 కంపెనీలు లాభాల్లోను, 1,391 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.