: బాబు సర్కారును విద్యార్థులే బంగాళాఖాతంలో కలుపుతారు: జగన్
తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రియింబర్స్ మెంట్ ను సక్రమంగా అమలు చేస్తామని, ఉపకార వేతనాల విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని, ప్రజలంతా తనను గుర్తు పెట్టుకునే రోజు వస్తుంది అని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ విషయమై ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జగన్ పైవిధంగా సమాధానమిచ్చారు. చంద్రబాబు సర్కారును విద్యార్థులే బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు. మోసం చేసి విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటే వాళ్ల ఉసురు చంద్రబాబుకు తగలక తప్పదని అన్నారు.