: చంద్రబాబు నాయుడు గారూ.. కేంద్రంపై ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా వస్తుంది: జగన్
‘చంద్రబాబు నాయుడు గారూ.. కేంద్రంపై ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా వస్తుంది’ అని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని, అప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి వచ్చే కంపెనీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని... తద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద పోరాడకుండా సింగపూర్, మలేషియా, దావోస్ లకు తిరిగితే లాభం లేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ లా అవుతుందని, ఈ హోదా సాధించిన ఉత్తరాఖండ్ లో 490 శాతం ఉద్యోగావకాశాల సంఖ్య పెరిగిందన్నారు.