: ఓ వైపు ఎండ.. మరోవైపు ఆకలి.. అయినా కదలని యువత : వైఎస్ జగన్
ఒక వైపు ఎండ.. మరోవైపు గాలి లేదు.. ఆకలి వేస్తున్నప్పటికీ కదలకుండా కూర్చున్న యువత.. మీ అందరిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలోని టౌన్ హాల్ లో ఈరోజు నిర్వహించిన వైఎస్సార్సీపీ యువభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘బాబు వస్తే.. జాబ్ వస్తుంది అనే నినాదంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతోంది. అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. బాబు మాటలన్నీ నీటి మూటలే’ అని జగన్ అన్నారు. అంతకుముందు, పలువురు ప్రొఫెసర్లు, యువతీయువకులు ప్రసంగించారు.