: జీమెయిల్ యూజర్లు@ వందకోట్లు
ఎప్పటికప్పుడు వినూత్నమైన సౌకర్యవంతమైన ఫీచర్లను ఆవిష్కరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ తన యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో జీ మెయిల్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ నెలవారీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్ కు చేరుకుందని గూగుల్ వెల్లడించింది. ఇందుకుగాను జీమెయిల్ తమ వినియోగదారులకు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపింది. గత త్రైమాసికంలోనే జీమెయిల్ ఈ మైలురాయిని చేరిందని సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 2004లో ప్రారంభించిన జీమెయిల్ కు 2015 మే నాటికి 900 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.