: పోలింగును బహిష్కరించిన రోషన్ దౌలా బస్తీవాసులు... సమస్యలు పరిష్కరించాలని ఆందోళన


ఎన్నాళ్లైనా తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ రోషన్ దౌలా బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో హస్తినాపురం డివిజన్ లో నిర్వహిస్తున్న పోలింగ్ లో పాల్గొనకుండా 1800 మంది ఓటర్లు నాలుగు గంటల నుంచి రోడ్డుపై బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు రావట్లేదని, తాగునీటి సౌకర్యం లేక ఎప్పటినుంచో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి, న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని కాలనీ వాసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారి ఆందోళనను విరమింపజేయాలని ఆర్డీవో ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము ఓటింగ్ లో పాల్గొంటామని కాలనీ వాసులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News