: చంద్రబాబుకు 'వెండి' పాదరక్షలు చేయించిన అనంతపురం కుటుంబం


'వస్తున్నా మీకోసం' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న సాహసోపేత పాదయాత్రను చూసి అనంతపురం జిల్లాకు చెందిన ఓ కుటుంబం చలించింది. ఇంత సుదీర్ఘంగా, ఈ వయసులో వేల కిలో మీటర్లు నడిచిన బాబు పాదాలకు ఆ కుటుంబ పెద్ద వసంతనాయుడు వెండి పాదరక్షలు చేయించాడు. వెండి వస్తువుల తయారీలో సిద్ధ హస్తుడైన కృష్ణమాచారి నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ పాదరక్షలు తయారుచేశాడు.

ఈ నెల 27న విశాఖలో యాత్ర ముగింపు సందర్భంగా బాబుకు వీటిని స్వయంగా తొడగాలని కుటుంబం భావిస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తున్న బాబుకు తామిచ్చే చిరుకానుక సాంత్వన చేకూరుస్తుందని వసంత నాయుడు అంటున్నాడు. దాదాపు 2800 కిలో మీటర్ల మేర 200 రోజులకు పైబడి అలుపెరగని బాటసారిలా బాబు పాదయాత్ర సాగుతోంది.

  • Loading...

More Telugu News