: జంగారెడ్డి గూడెంలో రోడ్డెక్కిన కాపులు!
తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్న కాపుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద కాపు సంఘాల నేతలు, పెద్దఎత్తున ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. కల్లాడ నుంచి దేవరపల్లి వెళ్లే రహదారిని నిర్బంధించిన కాపులు, తక్షణం రిజర్వేషన్ల జీవో ప్రకటించాలని, అంతవరకూ వాహనాలను తిరగనీయబోమని హెచ్చరించారు. వీరి నిరసనతో రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాపుల ధర్నా గురించిన ముందస్తు సమాచారం లేకపోవడంతో వీరిని అడ్డుకునే ప్రయత్నాలు జరగలేదు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఏలూరు నుంచి అదనపు బలగాలను దేవరపల్లికి పంపినట్టు సమాచారం.