: పోలింగ్ లో అవకతవకలు జరిగితే ఈసీకి ఫిర్యాదు చేయండి... డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబు


జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఇవాళ పార్టీ విడిజన్ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు చేసి సలహాలు ఇచ్చారు. చివరి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ బూతులు వదిలి వెళ్లొద్దని కార్యకర్తలకు సూచించారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే తక్షణమే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రెండు గంటలకు ఒకసారి సమీక్ష చేస్తానని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News