: ఆస్కార్ అవార్డుల ప్రెజంటర్ గా ప్రియాంకా చోప్రా


ఈ నెల 28న జరగనున్న ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ స్పష్టం చేసింది. అవార్డుల రెండో అర్ధభాగంలో స్టీవ్ కారెల్, క్విన్సీ జోన్స్, బ్యుంగ్ హున్ లీ, జేరిడ్ లిటో, జులియన్ మూరే, ఓలివియా మున్, మార్గోట్ రూబీ, జాసన్ సెగల్, జేకే సిమన్స్ తో పాటు కలసి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియాంకా చోప్రా, ఇక తాను ఓ మంచి డ్రస్ ను వెతుక్కోవాల్సి వుందని ట్వీట్ చేసింది. కాగా, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటరులో భారత కాలమానం ప్రకారం 29 తెల్లవారుఝామున అవార్డుల కార్యక్రమం జరగనుంది.

  • Loading...

More Telugu News