: ‘వాట్సప్’ యూజర్ల సంఖ్య 100 కోట్లు!


ఫేస్ బుక్ యాజమాన్యం ‘వాట్సప్’ను సొంతం చేసుకున్నాక ప్రముఖ మెసేజింగ్ సర్వీసు వాట్సప్’ యూజర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం. తాజాగా, ‘వాట్సప్’ కొత్త మైలురాయిని చేరుకుంది. ‘వాట్సప్’ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘వాట్సప్’ సహ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ లను ఆయన అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ‘వాట్సప్’ టీమ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా ఏడుగురిలో ఒకరు ‘వాట్సప్’ ను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, 2014లో ఫేస్ బుక్ యాజమాన్యం ఈ సంస్థను సొంతం చేసుకుంది. రెండేళ్ల లోపే ‘వాట్సప్’ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగారు.

  • Loading...

More Telugu News