: అఖిల్ కా... ఓటా? ఇంకా రాలేదు!: నాగార్జున
ఈ ఉదయం జూబ్లీహిల్స్ లో ఏర్పాటైన పోలింగ్ బూత్ కు తన సతీమణి అమలతో కలసి వచ్చిన తెలుగు హీరో నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఓటేయడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. నాగార్జున కుమారుడు అఖిల్ ఓటేసేందుకు ఎందుకు రాలేదని మీడియా ప్రశ్నించగా, ఓ నవ్వు నవ్వి "అఖిల్ కా... ఓటా? ఇంకా రాలేదులెండి" అని సమాధానం ఇచ్చాడు. ఓటేసే వయసుకు అఖిల్ రాలేదని చెప్పాడు. అయితే, వాస్తవానికి అఖిల్ 1994లో జన్మించాడు... మరి ఓటు హక్కు రాకపోవడమేమిటో!