: జూబ్లీహిల్స్ లో బాలకృష్ణ, బంజారాహిల్స్ లో కేటీఆర్ ఓటేశారు!


ఈ ఉదయం 7 గంటల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రారంభం కాగా, పోలింగ్ మందకొడిగా సాగుతోంది. దాదాపు అన్ని డివిజన్లలోని పోలింగ్ బూత్ ల వద్ద ఓటేసేందుకు వస్తున్న ప్రజల సంఖ్య స్వల్పంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బూత్ లు ఖాళీగా కూడా కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటైన ఓ పోలింగ్ బూత్ లో తెలంగాణ ఐటీ మంత్రి కే తారకరామారావు తన ఓటు హక్కును వినియోగించుకోగా, జూబ్లీహిల్స్ లో హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటేశారు. భాగ్ లింగంపల్లిలోని 24వ పోలింగ్ కేంద్రంలో భాజాపా నేత కిషన్ రెడ్డి, రామ్ నగర్ లో బండారు దత్తాత్రేయలు ఓటేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఓ అపార్టు మెంట్ లో 60కి పైగా ఓట్లు గల్లంతు కావడంతో 32వ పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News