: అధికారికంగా లింగ నిర్ధారణ... నిషేధం తొలగాలి: చట్టాలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ


కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ ప్రస్తుత చట్టాలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి అమలవుతున్న గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని ఆమె కోరారు. బిడ్డ కడుపులో ఉండగానే పుట్టబోయేది ఆడా? మగా? అన్నది తేల్చాలని అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆమె, లింగ నిర్దారణ అధికారికంగా జరిగి, నమోదైతేనే గర్భస్థ బాలికా శిశు మరణాలను తగ్గించవచ్చని ఆమె అన్నారు. భారత వైద్య విధానంలో నిత్యమూ లింగ నిర్ధారణ పరీక్షలు వేలల్లో జరుగుతున్నాయని, పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి భ్రూణ హత్యలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆమె, దీన్ని నిలువరించాలంటే, లింగ నిర్ధారణపై ఉన్న నిషేధాన్ని తొలగించి, పరీక్షల ఫలితాలను నమోదు చేయాలని అన్నారు. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్లో చర్చ జరుగుతోందని అన్నారు. ఈ పరీక్షలు చేయించుకుని భ్రూణ హత్యలకు పాల్పడి జైళ్లకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇకపై ఇలా జరుగరాదని అన్నారు.

  • Loading...

More Telugu News