: గణనీయంగా తగ్గిన తిరుమల భక్తులు!


తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం కేవలం 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం నిమిత్తం వేచిచూస్తున్నారు. వీరికి 3 గంటల్లోగా దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాలినడక భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వచ్చే భక్తులకు 2 గంటల్లోపే దర్శనం చేయిస్తున్నామని వివరించారు. నిన్న మొత్తం 54,794 మంది స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉన్న కారణంతోనే రాత్రివేళ వచ్చే భక్తుల సంఖ్య మందగించిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News