: తొలి ఓటేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు తన కుటుంబంతో కలిసి వచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అమీర్ పేట వార్డు నంబర్ 98లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తొలి ఓటును వేసి పోలింగ్ ను ప్రారంభించారు. అనంతరం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 150 డివిజన్లకు గాను 100కు పైగా డివిజన్లలో పోలింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పలు చోట్ల వందల సంఖ్యలో ప్రజలు ఓటు వేసేందుకు బారులు తీరారు.

  • Loading...

More Telugu News