: ఏమ్మా... డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎట్లున్నయ్?: ఆరా తీసిన కేసీఆర్ సతీమణి శోభ


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఆయన సతీమణి శోభ ఆరా తీశారు. ఈ గ్రామాల మీదుగా ప్రయాణించిన ఆమె, కాసేపు ఆగి పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పరిశీలించారు. ఇళ్లు ఎలా ఉన్నాయని అడిగిన ఆమె, పనులు వేగంగా జరుగుతున్నాయా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. "ఏమ్మా! డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎట్లున్నయ్?" అంటూ గ్రామస్తులను అడిగారు. కాసేపు అక్కడే కలియదిరిగిన ఆమె, తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News