: కేవలం 9 వేల ఓట్లు తెచ్చుకున్న నీ ముఖం చూసి అంతమంది వచ్చారా?: ముద్రగడను ప్రశ్నించిన చినరాజప్ప


2014లో కేవలం 9 వేల ఓట్లను మాత్రమే తెచ్చుకోగలిగిన ముద్రగడ పద్మనాభం ముఖం చూసి లక్షలాది మంది కాపులు వచ్చారా? అని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. సభకు వెళ్లకుంటే కాపుల గౌరవం పోతుందని భావించిన మీదటే, అంతమంది సభకు వెళ్లారని అన్నారు. తెలుగుదేశం పార్టీపై అవాకులు, చవాకులు పేలుతున్న ఆయన మాటలను ఎవరూ నమ్మరాదని కోరిన చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంతో గౌరవం ఇచ్చిందని అన్నారు. ముద్రగడ తానొక్కడే కాపు నేతని భావిస్తున్నాడని ఆరోపించిన ఆయన, వేదికపై ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. తుని హింసాకాండపై వీడియోలన్నీ ప్రభుత్వం చేతికి చిక్కాయని, విధ్వంసానికి బాధ్యులను పేర్లతో సహా వెల్లడిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News