: చిన్న వెంకన్న హుండీలో పడ్డ ఒక్క నోటు విలువ రూ. 1.14 కోట్లు!


పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల)లో కొలువైన చిన్న వెంకన్న హుండీలో ఓ భక్తుడు వేసిన విదేశీ నోటు విలువ రూ. 1.14 కోట్లు. అవును నిజమండీ... టర్కీ దేశానికి చెందిన 5 లక్షల లిరసీల (టర్కీ కరెన్సీ) నోటు ఒకటి వచ్చింది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 1,14,48,362. హుండీలోని డబ్బు లెక్కిస్తుండగా, ఈ నోటు బయటపడింది. చిన్న వెంకన్న హుండీకి విదేశీ కరెన్సీ వెల్లువెత్తిందని, 265 అమెరికన్ డాలర్లతో పాటు 730 సౌదీ రియాల్స్, 1 ఖతార్ రియాల్, 60 దిర్హామ్స్, 170 రింగెట్స్, 5 కెనడా డాలర్లు, 10 యూరోలు, 7 సింగపూర్ డాలర్లు, 1 దినార్ లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News