: తునిలో ‘సాక్షి’ మాత్రమే ప్రత్యక్షప్రసార వాహనాలు ఎలా ఏర్పాటు చేసింది?: చంద్రబాబు


తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన కాపు ఐక్య గర్జన సదస్సు వద్ద ‘సాక్షి’ మీడియా మాత్రమే ప్రత్యక్ష ప్రసార వాహనాలను ఎలా ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆరు ప్రత్యక్ష ప్రసార వాహనాలను ఏ విధంగా అక్కడ ఉంచిందని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం సబబుకాదని వైఎస్ జగన్ పై ఆయన మండిపడ్డారు. హింస సృష్టించాలనే ఉద్దేశంతోనే బయటి వ్యక్తులు తునికి వెళ్లారని అన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News