: కాపులంటే నాకు ఎనలేని గౌరవం: చంద్రబాబు
కాపులంటే తనకు ఎనలేని గౌరవమని, వాళ్లు చాలా మంచివారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తనకు ఎవరో చెబితో ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని అన్నారు. కాపుల ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న ఉద్దేశంతోనే తాను అధికారంలోకి వచ్చాకే కమిషన్ వేశామన్నారు. చట్టబద్ధత కల్పించేందుకే కమిషన్ వేశామని, వాటి నివేదికల ఆధారంగా జీవోలు ఇస్తామని బాబు పేర్కొన్నారు. జీవో నంబరు 30 కమిషన్ కు పరిశీలనా అంశం మాత్రమేనని అన్నారు. అసలు, జీవో నంబరు 30 లో ఏముందని దానిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతోందని ప్రశ్నించారు. గతంలో వైఎస్ కాపులకు ఎటువంటి మేలు చేయలేదని, వారిపై చిత్తశుద్ధి లేదని అన్నారు.